కోటి ఆశలతో కళాశాలలో చేరింది. కాలేజీలో చేరి చదువుకుంటున్నానన్న సంతోషం ఆ విద్యార్థినికి నాలుగురోజులైనా నిలవలేదు. ఏమైందో తెలీదు గానీ.. కాలేజీ హాస్టల్ లో బలవన్మరణానికి పాల్పడి.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కలసపాడు మండలం నల్లగొండపల్లెకు చెందిన ముద్దం వెంకటేశ్వర్లు, కళావతికి కుమార్తె సుజాత, కుమారుడు ప్రదీప్ ఉన్నారు. సుజాత (17) గతేడాది ఇంటర్ పూర్తి చేసింది. చదువుకోవాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పగా.. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. ఈనెల 13న కడప నగరంలోని ఊటుకూరులో ఉన్న […]