విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ పెట్టే ప్రతిపాదనకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అనుకూలమో లేదా వ్యతిరేకమో చెప్పాలని అధికారపార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రాంతాల మధ్య చంద్రబాబు విద్వేషాలు రేపుతున్నారని మండిపడ్డారు. ప్రజల మధ్య గోడవలు పెడుతున్న చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ […]