విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిని ఇంటిలో, ప్రభుత్వ క్వారంటైన్ లో కట్టడి చెయ్యడం కష్టతరం కావడంతో రాష్ట్ర పోలీసులు చైనా తరహా లో సరికొత్త విధానాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులందరిని వారి పూర్తి వివరాలతో జియో ట్యాగింగ్ కు అనుసంధానం చెయ్యడం ద్వారా నియంత్రించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈమేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సాంకేతిక నిపుణులైన పోలీసు అధికారుల బృందం ఒక కొత్త హౌస్ క్వారంటైన్ యాప్ ని రూపొందించింది. […]