ఛత్తీస్గఢ్ లో శనివారం రాత్రి పక్కా ప్రణాళికతో కూంబింగ్ పార్టీని టార్గెట్ చేసిన మావోయిస్టులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. కాల్పుల్లో కొందరిని.. చిత్రహింసలు పెట్టి మరికొందరిని హతమార్చారు. నీరు, తిండి లేక ఇంకొందరు క్షతగాత్రులు ప్రాణాలు విడిచారని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందినట్లు ఆదివారం మధ్యాహ్నం వరకు ఉన్న లెక్క సాయంత్రానికి 24కు పెరిగింది. ఇంకా ఆచూకీ లేని మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఛిద్రమైన మృతదేహాలు ఎదురుకాల్పుల్లో […]