గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ గెలవాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. జనసేన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు. జనసేన ఓటు ఒక్కటి కూడా బయటకు వెళ్లకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాన్ బీజేపీ నేతలతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలసి కేంద్ర మంత్రి […]