పేదరికాన్ని తట్టుకోలేక కుటుంబ ఆర్ధిక భారాన్ని కొంతైనా తగ్గించుకోవాలనే ఆలోచనతో ఉద్యోగాల కోసం , ఉపాధి కోసం పొట్ట చేత బట్టుకుని ఏజెంట్ల మాటలు నమ్మి అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ షేకులకు బానిసలుగా మారుతున్న ఉదంతాలు నిత్యం మనకు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. షేకుల కబంధ హస్తాల నుండి తప్పించుకుని కువైట్ లోని భారత దౌత్య కార్యలయానికి చేరుకున్న సుమారు 200 మంది బాధిత మహిళలు తమని ఎలాగైనా […]