రైతు, రైతాంగం బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది, ఇళ్లాలు బాగుంటేనే ఇళ్లు బాగుంటుందనే ఉద్దేశంతో జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. అనంతరం పథకం లక్ష్యాలు, అమలు తీరును వివరించారు. ‘‘ వ్యవసాయంతోపాటు పశుపోషణ ఉంటేనే గ్రామాలు బాగుంటాయి. వ్యవసాయేతర ఆదాయం వస్తేనే కరువును సమర్థవంతంగా ఎదుర్కొనగలం. పశుపోషన ద్వారా సుస్థిర జీవనోపాధి లభిస్తుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ […]