1983 సంవత్సరం. ‘మంచుపల్లకి’తో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వంశీకి ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది కానీ కమర్షియల్ గా మరీ గొప్ప స్థాయికి వెళ్లలేకపోయింది. సున్నితమైన కథాంశాన్ని నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయితో చేసిన స్నేహం గురించి తీసిన తీరు విమర్శకులను మెప్పించింది. అప్పుడే తను అసిస్టెంట్ గా ఎన్నో చిత్రాలకు పని చేసిన పూర్ణోదయా సంస్థ నుంచి వంశీకి ఆఫర్ వచ్చింది. మంచి కథను సిద్ధం చేసుకోమని చెప్పారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. అప్పటికే […]
ఇప్పుడంటే పోకిరి, ఇడియట్ లాంటి నెగటివ్ టైటిల్స్ ఒక ట్రెండ్ గా మారిపోయి హీరోయిజంకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాయి కానీ ఒకప్పుడు వీటికి శ్రీకారం చుట్టింది చిరంజీవే. దొంగ, గూండా, రాక్షసుడు లాంటి పేర్లు జనంలోకి బాగా వెళ్లడమే కాదు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కూడా అందించాయి. కానీ ప్రతిసారి అలాంటి ఫలితాలు అందుకోలేవుగా. కథాకథనాలు చాలా ముఖ్యం. ఓ ఉదాహరణ చూద్దాం. 1986. ఇంకా మెగాస్టార్ బిరుదు రాలేదు కానీ చిరు మంచి ఫామ్ […]
నిన్న నాగ శౌర్య లక్ష్యతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. అంతో ఇంతో జనాల దృష్టిలో పడ్డ రెండో చిత్రం గమనం. శ్రేయ ప్రధాన పాత్ర పోషించడం, ఇళయరాజా సంగీతం సమకూర్చడం, ట్రైలర్ లో ఇంటెన్సిటీని చూపించడం లాంటి అంశాలు ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. గత ఏడాది లాక్ డౌన్ టైంలోనే రిలీజ్ కు సిద్ధమైన ఈ డిఫరెంట్ జానర్ మూవీ ఒకపక్క అఖండ ప్రవాహం, మరోపక్క పోటీని తట్టుకుని కేవలం కంటెంట్ ని […]