దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా వినోదం ప్రతివారం క్రమం తప్పకుండా ఉంటోంది. కనీసం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ ఉండేలా నిర్మాతలు చేసుకుంటున్న ప్లానింగ్ మూవీ లవర్స్ కి మాములు ఆనందాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఒకే ఫలితాన్ని అందుకోలేకపోయినా పెద్ద చిత్రాలకు చిన్న సినిమాలు ఇచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు. తాము థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉండటంతో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. […]