హోరా హోరీగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉండడంతో తుది ఫలితాలపై రాజకీయ పార్టీలలోనూ, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో లెక్కింపునకు సమయం పట్టే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహా కాంగ్రెస్ కూడా తన శక్తిమేరకు ఈ ఎన్నికల్లో పోరాడాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు గ్రేటర్పై తమ జెండా […]