ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకే అధికారులు, మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ మొగ్గు చూపింది. జీఎన్‌రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు ఆర్థిఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన హైవపర్ కమిటీ ఈ మేరకు రెండు కమిటీలపై ప్రాథమికంగా చర్చించింది. రాష్ట్రంలో ప్రజలు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ పై ప్రజల్లో జరుగుతున్న చర్చపై సమావేశంలో చర్చించారు. ప్రజల మనోభావాలను గౌరవించి పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామన్నారు. రెండు నివేధికలపై […]