నటీనటులు తాము పనిచేసే సినిమా టైటిల్తో సరిపడే అనుభూతిని పొందడం చాలా అరుదు. తాజాగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ‘దోచేవారెవరురా’ చిత్రంలో నటిస్తున్న మాళవిక సతీశన్కు అలాంటి సంఘటనే జరిగింది. గుంటూరులోని మలినేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో జరిగిన ‘దోచేవారెవరురా’ పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, చిత్ర దర్శకుల సమక్షంలో కాలేజ్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు ఈ పాటను ఆవిష్కరించారు. ఆ తర్వాత కొందరు విద్యార్థులు నటి మాళవిక సతీశన్తో సెల్ఫీలు దిగాలనుకున్నారు. […]