కాలం ఎప్పుడైనా మల్టీ స్టారర్స్ కు ఉండే క్రేజే వేరు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కలిసి నటిస్తే తెరమీద చూస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరు. 1978 సంవత్సరం. విజయనిర్మల దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. పెద్ద ఇమేజ్ ఉన్న ఇద్దరు కథానాయకులు దానికి కావాలి. తనతో పాటు శోభన్ బాబు అయితే బాగుంటుందని భావించి రచయిత మహారథిని పంపించి ఆయనకు వినిపించారు. ముందు ఓకే చెప్పిన అందాల […]