దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దాదాపు 15 రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తుంది. సామన్య ప్రజలు నుంచి రాజకీయ నేతలు, పోలీసులు, డాక్టర్లు, సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు ఇలా అన్ని వర్గాల ప్రజలపై కరోనా విశ్వరూపం దాల్చుతుంది. అయితే ఇటివలి రాజకీయ నేతల్లో కరోనా కలవరం పెట్టిస్తుంది. తమిళనాడులోని డిఎంకె ఎమ్మెల్యే జె.అంబఝగన్ కరోనా సోకి మృతి చెందారు. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ బిజెపి కౌన్సిలర్ గయప్రసాద్ కనోజియా కరోనాతోనే మృతి చెందారు. […]