కేంద్రంలోని అధికార బిజెపి రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్లో చేపట్టిన ఆపరేషన్ కమల్ విజయవంతమై నాలుగింట మూడు రాజ్యసభ స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల ఫలితాల సెగ తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తగిలింది. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. ఈ నెల ప్రారంభంలో గుజరాత్ శాఖ అధ్యక్ష పదవి నుంచి వాఘేలాను ఎన్‌సిపి తొలగించింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే జయంత్ పటేల్‌కు […]