తెలంగాణాలో బీజేపీ దూకుడుకి అనూహ్యంగా అడ్డుకట్ట పడినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ రాజకీయ చాణుక్యం బీజేపీకి బ్రేకులు వేస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓటమి కమలదళంలో కొంత కలవరం పుట్టిస్తోంది. విద్యావంతులు, అందులోనూ అత్యధికంగా పట్టణ ప్రాంతీయులు ఓట్లేసిన చోట బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిగా బలపడతామని ఆశిస్తే ప్రస్తుతం ఫలితాలు కొంత నిరాశపరిచినట్టుగా చెబుతున్నారు. వరుసగా దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఫలితాలతో జోష్ నిండిన […]