ఏ పార్టీలో ఉన్నా నియోజకవర్గంలో తనకు ఎదురులేదనే భావనలో ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన భావన సరికాదని తాజాగా వెల్లడైన అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలతో రవికి అర్థమైంది. హోరాహోరీగా సాగిన అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గాలి వీచింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి టీడీపీ తట్టుకోలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఫలితాలు ఎలా ఉన్నా.. పలు చోట్ల తాము తప్పకుండా గెలుస్తామనే ధీమాతో టీడీపీ […]