మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ చర్చనీయాంశమే. రాజకీయంగా ఆయన నిర్ణయాలు ఆసక్తికరమే. ఉపాధి కోసం విశాఖ వెళ్లి, ఆంధ్రభూమి పత్రికలో ఉద్యోగం నుంచి ఓ కాంట్రాక్ట్ సంస్థకు అధినేతగా మారిన ఆయన ప్రస్థానంలో రాజకీయ జీవితం విశేషంగానే చెప్పాలి. టీడీపీ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్, మళ్లీ టీడీపీ ఇలా పలు పార్టీలలో సాగారు. అనకాపల్లి ఎంపీ నుంచి ఎమ్మెల్యే, చోడవరం నుంచి భీమిలి మీదుగా మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి స్వల్ప […]