విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో లోపాలున్నాయా..? అనే సందేహాలు తాజాగా జరిగిన ప్రమాదంతో తలెత్తుతున్నాయి. ఖతార్ రాజధాని దోహా నుంచి విజయవాడ మీదుగా తిరుచిరాపల్లికి వెళ్లేందుకు ఎయిరిండియాకు చెందిన బోయింగ్ ఎక్స్ప్రెస్ – 737 గన్నవరంలో ల్యాండ్ అయింది. ఇందులో విజయవాడకు చెందిన ప్రయాణికులు 14 మంది, తిరుచిరాపల్లికి చెందిన వారు 45 మంది ఉన్నారు. పైలెట్, సిబ్బంది కాకుండానే మొత్తం 64 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణించారు. రన్వేపై దిగిన బోయింగ్ ఎక్స్ప్రెస్ […]