మత్తుకు బానిసగా మారడం అంటే సాధారణంగా మద్యమే అని అనుకోవడం సహజం. కానీ అంతకు మించి మత్తుకోసం కొందరు ప్రయత్నిస్తున్నట్టుగా తేలుతోంది. ఇందు కోసం గంజాయితో పాటు, అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ను కూడా వినియోగిస్తున్నారని పోలీసువర్గాలు తేల్చేస్తున్నాయి. ఎంతగా కట్టడి చేస్తున్నప్పటికి ఏదో రూపంలో ఇవి దేశంలోకి చొరబడుతున్నాయి. ‘నయా’ సంపాదనా పరులను మత్తులో ముంచెత్తుతున్నాయి. ఈ మత్తుకు లొంగి ఎవడి ఇంట్లో వాడు పడి ఉంటే ఎవ్వరికీ ఇప్పటి వరకు అభ్యంతరాలు ఉండకపోయేవి. విధి నిర్వహణలో […]