రాష్ట్రంలో టిడిపి పరిస్థితి డెంగ్యూ పేషంట్ మాదిరిగా మారింది.. డెంగ్యూ రోగ తీవ్రత పెరిగేకొద్దీ రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇక తెలుగు దేశం పరిస్థితి కూడా అలాగే ఉంది. చిల్లుకుండలోని నీళ్లు ఒక్కొబొట్టు కిందకు జారినట్లు అధికారం కోల్పోయిన నాటి నుంచి ఒక్కో నాయకుడూ పార్టీని వీడుతున్నాడు. దానికితోడు నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డప్పుకొట్టి మరీ టముకు వేసినట్లు టిడిపి వాళ్లంతా బీజేపీలోకి వచ్చేయండని పిలుపునిచ్చారు. ఇప్పటికే పలువురు నాయకులు బీజేపీలో […]