అక్రమంగా ఉగ్రవాద కేసుల్లో ఇరికించినందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ వ్యక్తికి ఏకంగా 14 లక్షల 85 వేల రూపాయల పరిహారం చెల్లించుకుంది. అమృత్ సర్ కి చెందిన సరబ్ జీత్ సింగ్ వెర్కా పంజాబ్ మానవ హక్కుల సంఘంలో సభ్యుడు. పంజాబ్ పోలీసులు అతనిపై రెండు తప్పుడు ఉగ్రవాద కేసులు బనాయించారు. వీటిలో ఒకటి 1992లో నమోదు కాగా మరొకటి 1998లో రిజిస్టరైంది. అయితే 2007 నాటికి ఈ రెండు కేసుల్లోనూ సరబ్ జీత్ నిర్దోషిగా తేలాడు. […]