iDreamPost
android-app
ios-app

Punjab: తప్పుడు కేసులు బనాయించినందుకు 15 లక్షల పరిహారం

Punjab: తప్పుడు కేసులు బనాయించినందుకు 15 లక్షల పరిహారం

అక్రమంగా ఉగ్రవాద కేసుల్లో ఇరికించినందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ వ్యక్తికి ఏకంగా 14 లక్షల 85 వేల రూపాయల పరిహారం చెల్లించుకుంది. అమృత్ సర్ కి చెందిన సరబ్ జీత్ సింగ్ వెర్కా పంజాబ్ మానవ హక్కుల సంఘంలో సభ్యుడు. పంజాబ్ పోలీసులు అతనిపై రెండు తప్పుడు ఉగ్రవాద కేసులు బనాయించారు. వీటిలో ఒకటి 1992లో నమోదు కాగా మరొకటి 1998లో రిజిస్టరైంది. అయితే 2007 నాటికి ఈ రెండు కేసుల్లోనూ సరబ్ జీత్ నిర్దోషిగా తేలాడు. పోలీసుల వేధింపులకు పరిహారం చెల్లించాలంటూ అతను 2008లో అమృత్ సర్ కోర్టులో పిటిషన్ వేశాడు. సరబ్ జీత్ కి 10 లక్షలు చెల్లించాలంటూ కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని 2013లో ఆదేశించింది. కానీ అతనికి పరిహారం అందలేదు. దీంతో ఒత్తిడి పెంచే దిశగా కోర్టు, పంజాబ్ డీజీపీ, అమృత్ సర్ డీసీ కార్లను అటాచ్ చేస్తూ రూలింగ్ ఇచ్చింది. అలాగే 6 శాతం వార్షిక వడ్డీ లెక్కగట్టి మొత్తం 14 లక్షల 85 వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom