తెలుగులో అంతగా సుపరిచితం కాని విష్ణు విశాల్ తమిళ సినిమాలు అలవాటున్న వాళ్లకు పరిచయమే. ముఖ్యంగా రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లకు గుర్తుండిపోయాడు. దాన్నే తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేసుకున్నది. కోలీవుడ్ లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉన్న విష్ణు విశాల్ మొదటిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. దానికి కారణం ఎఫ్ఐఆర్ కి సమర్పకుడు మాస్ మహారాజా రవితేజ కావడమే. టెర్రరిస్టు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాకు దర్శకుడు మను ఆనంద్. […]