ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి 2009లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో ఏ పార్టీలోనూ టిక్కెట్ రాకపోవడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి సుమారు 2,600 ఓట్లు తెచ్చుకున్నారు. 2019లో టీడీపీ తరపున పోటీచేసి వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌యాదవ్ చేతిలో 40 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. దశాబ్ధం పాటు అధికారానికి దూరంగా ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి.. […]
ప్రకాశం జిల్లా కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రకాశంలో కనిగిరి నియోజకవర్గం ఒకటి. కనిగిరి అంటే గుర్తొచ్చేవి కరువు, పొట్టకూటి కోసం వలసలు, ఫ్లోరోసిస్. ఇప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు ఉపాధి కోసం గుంటూరు మిర్చి యార్డు, విజయవాడలో బరువులు మోసే పనికి, హైదరాబాద్, బెంగుళూరు నగరాలకు సిమెంట్ పని కోసం వెళుతున్నారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్న కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుర్రా మదుసూధన్ యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న […]