దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలం దూసుకెళుతోంది. ఓట్లు లెక్కింపు ప్రారంభం నుంచి ఆ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. తాజాగా పూర్తయిన నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపులోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ 2,684 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. రెండో స్థానంలో టీఆర్ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీలు నిలిచాయి. ఇంకా 19 రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. దుబ్బాకలో కమలం జోరు.. […]