డీఎస్సీ–2018లో అర్హత సాధించి మెరిట్లో నిలిచిన అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ ద్వారా స్కూళ్లలో నియమిస్తూ ఆదివారం పోస్టింగ్లు ఇచ్చారు. కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లు.. ఎంపికైన అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందజేశారు. డీఎస్సీ–2018లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో ఎలాంటి న్యాయ వివాదాలు లేని వివిధ కేటగిరీల్లోని 2,654 పోస్టులకు ఆదివారం ఈ నియామక ఉత్తర్వులిచ్చారు. మిగిలిన పోస్టులకు సంబంధించిన వ్యాజ్యం త్వరలో హైకోర్టులో […]