కొన్ని నెలలుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఆతృతగా నిరీక్షిస్తున్న తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూలు విడుదలైంది. తిరుపతి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూలు ప్రకటించింది. ఈ నెల 23న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచీ నామినేషన్లు దాఖలు చేయడానికి వీలుంటుంది. 30వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి గడువు. ఏప్రిల్ 17వ తేదీన […]
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో విశ్వసనీయతకు ప్రాధాన్యతనిచ్చారు. కొత్త అభ్యర్థిని తెరమీదకు తెచ్చారు. గడిచిన కొన్నేళ్ళుగా తన వెంట నడిచిన నేతను అభ్యర్థిగా బరిలో దింపారు. ఇప్పటికే బాపట్ల ఎంపీ స్థానం నుంచి నందిగం సురేష్ కి అవకాశం ఇచ్చినట్టే ఈసారి తిరుపతి నుంచి గురుమూర్తికి ఛాన్స్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామానికి చెందిన ఎం.గురుమూర్తి నేపద్యాన్ని గమనిస్తే, వైఎస్ఆర్ హయాంలో ఫిజియోథెరపి స్టూడెంట్ గా […]