నదిలో పాతనీరు పోయేకొద్దీ కొత్తనీరు వస్తుందన్నట్లుగా.. రాజకీయాల్లోనూ పాత నేతల స్థానంలో కొత్త నేతలు రావడం సర్వసాధారణంగా జరిగేదే. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కుటుంబాలు రాజకీయాల్లో తనదైన ముద్రవేసి ఆ తర్వాత కనుమరుగయ్యాయి. మరికొన్ని కుటుంబాలు రాణిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రాజకీయ కుటుంబం ఏపీ రాజకీయాల నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం రాజకీయపయనం ముగిసింది. పోయిన ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉన్న దివి శివరాంకు రాబోయే ఎన్నికల్లోనూ […]
స్కందపురిగా పేరొందిన కందుకూరు రాజకీయంగా ఎప్పుడూ ప్రత్యేకమైన నియోజకవర్గమే. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం.. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజవర్గ ప్రజలకు రెండు జిల్లాల ప్రజా ప్రతనిధులు రాష్ట్ర, దేశ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా.. స్వల్ప ఆధిక్యమే. హోరాహోరీ పోరు ఇక్కడ సాగుతుంది. కమ్మ సామాజికవర్గ ప్రాభల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మానుగుంట కుటుంబం ఆధిక్యతను […]