ధనుష్ తమిళంలో ఎంత పెద్ద స్టార్ అయినా కావొచ్చు గాక. రజనీకాంత్ అల్లుడు అనే బ్రాండ్ ఉండొచ్చు. అసురన్, కర్ణన్ లాంటి అద్భుతమైన సినిమాలు చేసుండొచ్చు. కానీ సగటు తెలుగు ప్రేక్షకులకు అతని గురించి తెలిసింది తక్కువే. ఒక్క రఘువరన్ బిటెక్ మాత్రమే చెప్పుకోదగ్గ గుర్తింపు ఇచ్చింది. అరవంలో జాతీయ అవార్డు తెచ్చిన చిత్రాన్ని ఇక్కడ పందెం కోళ్లు టైటిల్ తో రిలీజ్ చేస్తే మొన్నెప్పుడో టీవీలో వచ్చే దాకా అదుందన్న సంగతి కూడా ఎవరికీ తెలియకుండా […]
కొన్ని సినిమాలు ప్రారంభోత్సవం చేసుకుంటాయి కానీ సెట్స్ పైకి వెళ్ళేలోగా ఆగిపోయేవి ఎన్నో. అందులోనూ స్టార్లు ఉన్నవి అయితే మళ్ళీ రీ స్టార్ట్ కావడం కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. అలాంటిదే ఇది కూడా. 2018లో ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నాన్ రుద్రన్(నేను రుద్రుడిని)టైటిల్ తో ఓ మూవీని మొదలుపెట్టారు. గ్రాండ్ ఓపెనింగ్ చేసి మీడియాను కూడా పిలిచారు. పా పాండి తర్వాత ధనుష్ డైరెక్షన్ మూవీ కావడంతో ముందే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇది […]
సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ కు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవచ్చు కానీ గుర్తింపు మాత్రం బాగానే ఉంది. దానికి కారణం రఘువరన్ బిటెక్. అప్పట్లో ఇది సాధించిన భారీ విజయం తర్వాత ఎన్నో డబ్బింగ్ చిత్రాలను వచ్చేలా చేసింది కానీ ఏ ఒక్కటీ ఆడకపోవడంతో ఆ తర్వాత ధనుష్ వి అనువదించడం మానేశారు. వడ చెన్నై లాంటి మాస్టర్ పీస్ కూడా మనకు చూసే అవకాశం దక్కలేదు. సరే అసురన్ బ్రహ్మాండంగా ఆడింది కదా […]
గతవారం విడుదలైన భీష్మ సందడి బాగానే కొనసాగుతోంది. మూవీ లవర్స్ కి ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు కావాల్సిందే కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టి 28వ తేదీ మీద పడింది. హైప్ పరంగా చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న విశ్వక్ సేన్ హిట్ ఎక్కువ అడ్వాంటేజ్ లో ఉంది. ఇవి కాకుండా మరో రెండు డబ్బింగ్ మూవీస్ కూడా అదే రోజు పలకరించనున్నాయి. అందులో ధనుష్ లోకల్ బాయ్ ఒకటి. ఇది గత నెల సంక్రాంతికి […]
అదేంటి పంచ పాండవులు గురించి విన్నాం కాని ఇదేంటి అనుకోకండి. సింబాలిక్ గా ఐదు నెంబర్ ని అలా చెప్పాం అంతే. ఇక విషయానికి వస్తే ప్రపంచ ప్రేమికులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే వాలెంటైన్ డే ఇంకో మూడు రోజుల్లో రాబోతోంది. ఆ రోజు రోజా పూలు, బోకేలు, గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు పేరుతో వందలాది కోట్ల వ్యాపారం జరిగే సంగతి తెలిసిందే. అందులోనూ ప్రేమ పక్షులు సెలెబ్రేట్ చేసుకోవడానికి చూసుకునే మంచి ఆప్షన్ సినిమా. తెలుగులో […]
నిన్న రాత్రి విడుదలైన వెంకటేష్ నారప్ప ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆన్ లైన్ ని కుదిపేశాయి. అసురన్ ని ఇప్పటికే చాలా మంది అమెజాన్ ప్రైమ్ లో చూసేసిన నేపథ్యంలో వెంకీ ఈ పాత్రకు ఎంతవరకు సూట్ అవుతాడా అనే అనుమానాలు లేకపోలేదు. వాటిని పూర్తిగా పటాపంచలు చేస్తూ ఒకరకంగా చెప్పాలంటే వెంకటేష్ తనకన్నా చాలా చిన్నవాడైన ధనుష్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో తన అనుభవాన్ని ఉపయోగించి నారప్ప పాత్రలోని విభిన్న హావభావాలను అద్భుతంగా […]
తమిళ్ లోనే కాదు తెలుగు మలయాళం కన్నడలోనూ తన అద్భుతమైన సంగీతంతో కోట్లాది అభిమానులను సంపాదించుకుని ఇప్పటికీ రారాజులా వెలిగిపోతున్న ఇళయరాజా నిజజీవిత కథ త్వరలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్నీ స్వయానా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా వెల్లడించడం విశేషం. ఆ ఆలోచన ఉందని త్వరలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హీరోగా ఎవరు నటిస్తారు అనే దాని గురించి క్లారిటీ లేదు. ధనుష్ తో చేస్తే బాగుంటుందన్న […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే కోకాపేటలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇంట్రో సాంగ్ ని షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. మణిశర్మ ఇప్పటికే 3 పాటలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలన్స్ 2 ఈ నెలలోనే రికార్డింగ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ఓ కీలకమైన పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నాడనే టాక్ చాలా రోజుల నుంచి ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు అది నిజమేనట. ఇందుకుగాను ఓ నెలన్నర […]
అసురన్ తమిళంలో సంచలన విజయాన్ని సాధించింది. అసురన్ రూపొందించిన వెట్రిమారన్ ఖాతాలో భారీ విజయం దక్కింది.గత కొంతకాలంగా ఫ్లాపుల్లో కూరుకుపోయిన ధనుష్ ని అసురన్ ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కించిన డైరెక్టర్ వెట్రిమారన్. తెలుగులో వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ ను వెట్రిమారన్ రూపొందించనున్నారని ఊహాగానాలు సినీవర్గాల్లో కలిగాయి. కానీ ఇప్పుడు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతుందని నిర్మాత థాను ప్రకటించడంతో తెలుగులో అసురన్ రీమేక్ వెట్రిమారన్ రూపొందిస్తారన్న […]