iDreamPost
iDreamPost
అదేంటి పంచ పాండవులు గురించి విన్నాం కాని ఇదేంటి అనుకోకండి. సింబాలిక్ గా ఐదు నెంబర్ ని అలా చెప్పాం అంతే. ఇక విషయానికి వస్తే ప్రపంచ ప్రేమికులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే వాలెంటైన్ డే ఇంకో మూడు రోజుల్లో రాబోతోంది. ఆ రోజు రోజా పూలు, బోకేలు, గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు పేరుతో వందలాది కోట్ల వ్యాపారం జరిగే సంగతి తెలిసిందే. అందులోనూ ప్రేమ పక్షులు సెలెబ్రేట్ చేసుకోవడానికి చూసుకునే మంచి ఆప్షన్ సినిమా. తెలుగులో ఆ రోజు అందరి దృష్టి విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మీదే ఉంది కాని ఇంకో నాలుగు సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి.
అన్నింటిలోనూ ఏదో విధంగా లవ్ ఎలిమెంట్ అయితే ఉండటం విశేషం. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. టాక్ బాగా వచ్చిందో వసూళ్ళ వర్షం ఖాయం. ధనుష్ హీరోగా గత నెల తమిళ్ లో విడుదలైన పట్టాస్ ని తెలుగులో లోకల్ బాయ్ పేరుతో డబ్బింగ్ చేశారు. రఘువరన్ బిటెక్ తర్వాత ఇక్కడ సక్సెస్ లేని ధనుష్ ఆన్ లైన్ లో మనవాళ్ళు చూసిన అసురన్ పుణ్యమాని అంతో ఇంతో దీని ద్వారా ఆసక్తి రేపుతున్నాడు. స్నేహ, మెహ్రీన్ తెలిసిన హీరొయిన్లే కావడం ప్లస్ కావొచ్చు.
ఒక చిన్న విరామం, లైఫ్ అనుభవించు రాజా. శివ 143 అనే మరో మూడు చిన్న సినిమాలు కూడా ప్రేమికుల రోజునే తమ అదృష్టాన్ని పరీక్షించుకోకున్నాయి. బాక్స్ ఆఫీస్ పరంగా డ్రై మంత్ గా చెప్పుకునే ఫిబ్రవరిలో ఒకే రోజు 5 సినిమాలు రావడం అంటే విశేషమే. ఓపెనింగ్స్ లో వరల్డ్ ఫేమస్ లవర్ కి ఇవేవి సాటి రావు కాని టాక్ఏవైనా టాక్ పాజిటివ్ గా తెచ్చుకుంటే మత్తు వదలర తరహాలో స్లోగా పికప్ అవ్వొచ్చు. మొత్తానికి ప్రేమికుల రోజున మూవీ లవర్స్ కి ఐదు ఆప్షన్స్ ఉండటం విశేషమే. ఒకవేళ హింది సినిమాలు చూసే అలవాటు ఉంటె లవ్ ఆజ్ కల్ విడుదల వాళ్ళకు బోనస్.