కరోనా వైరస్ లాక్ డౌన్ తో ఆగిపోయిన రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరిగింది. కరోనాను సైతం పక్కపెట్టి తమతమ స్థానాలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ..ప్రతి వ్యూహాలను రచిస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఈ రాజకీయ వేడి పెరిగింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ళు, బేరసారాలు జరిగిపోతున్నాయి. బేరం కుదిరిన ఎమ్మెల్యేలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. అయితే పరిస్థుతులన్ని అధికార […]