పన్నెండేళ్ల క్రితం లీడర్ తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా మీద అప్పట్లో దగ్గుబాటి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. బాబాయ్ వెంకటేష్ వారసుడిగా ధీటైన పోటీ ఇస్తాడనుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా వచ్చిన ఫ్లాపుల వల్ల మార్కెట్ ఆశించినంత స్థాయిలో పెరగలేదు. కృష్ణం వందే జగద్గురుమ్ హిట్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ బాహుబలి వచ్చేదాకా బ్రేక్ రాలేదు. అందులో కూడా విలన్ క్యారెక్టర్ చేయడం వచ్చిన పాపులారిటీ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు […]
దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ నిన్న సాయంత్రం భీమ్లా నాయక్ సినిమాలో రానా క్యారెక్టర్ ని రివీల్ చేయడం ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వైరల్ అయిపోయింది. సెలబ్రిటీ షేర్లు గట్టిగానే దక్కాయి. ఒరిజినల్ వెర్షన్ లో రానా పాత్ర చేసిన పృథ్విరాజ్ రీ ట్వీట్ చేసి పెద్ద మెసేజ్ పెట్టడం నెటిజెన్లను ఆకట్టుకుంది. గతంలో పవన్ కళ్యాణ్ లుక్ ని రివీల్ చేసినప్పుడు టైటిల్ లో మా హీరో పేరు లేదని […]