కరోనా వ్యాప్తి విషయంలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ, కేరళ రాష్ట్ర్రాలు అందరికీ పాఠం నేర్పుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఏడు నెలల క్రితం కరోనా మొదట్లో ఉన్న భయం, ఆందోళన ఇప్పుడు జనంలో కన్పించడం లేదు. నిజానికి ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందొద్దు, అప్రమత్తంగా ఉండండి అనే మొత్తుకుంటున్నాయి. కానీ జనం ఆందోళన మాత్రమే విడిచిపెట్టారు. అప్రమత్తత విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇదే ముప్పు పెంచబోతోందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవున్నాయి. కరోనా తగ్గిపోయిందన్న […]