కరోనా థర్ట్ వేవ్ ఆంధ్రప్రదేశ్లో చల్లారిపోయింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కేవలం 79 కేసులు వెలుగుచూశాయి. 14,516 మందిని పరీక్షించగా.. 79 మందికి మాత్రమే పాజిటివ్గా తేలడం గమనార్హం. ఈ గణాంకాలు పాజిటివిటీ రేటు భారీ తగ్గిందని చెబుతున్నాయి. మెజారిటీ జిల్లాలో కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో […]