ఎన్నికల నగారా మోగినప్పటి నుంచీ జీహెచ్ఎంసీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ గ్రేటర్లో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అభ్యర్థుల ఎంపికలోనే ఆచితూచి వ్యవహరించింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సర్వేలను పరిగణనలోకి తీసుకుని 27 మంది సిట్టింగ్లను పక్కన పెట్టింది. ఇదంతా ఒకటైతే.. పాత వారిని పక్కనబెట్టడంలోనూ, నిలుపుకోవడంలోనూ కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. తమను నమ్మిన, తమకు నచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇప్పించుకున్నారు. వారికిప్పుడు అసలు టెన్షన్ మొదలైంది. పట్టుబట్టి టికెట్లు […]