రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుగా రాజధాని అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన GN రావు కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. నివేదిక లోని అంశాలను ముఖ్యమంత్రికి వివరించింది. సెప్టెంబర్ 13న ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు నివేదిక ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. కాగా ఈ నెల 27న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. […]