ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలను వక్రీకరిస్తూ, తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఫోర్జరీ వీడియోను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ప్రెస్మీట్లో వాడిన సెల్ఫోన్, ట్యాబ్లను గురువారం విచారణ సందర్భంగా దేవినేని ఉమా తీసుకురాకపోవడంతో మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. తొలిసారి జారీ చేసిన నోటీసుల్లోనే ఫోన్, ట్యాబ్ తీసుకురావాలని స్పష్టంగా సీఐడీ పేర్కొన్నా.. దేవినేని వాటిని వెంట […]