ఎన్నికల్లో ఓటమి తరువాత నేతల్లో అసహనం ఉండడం సహజం. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి దీని పాలు కాస్తంత ఎక్కువైందంటున్నారు పరిశీలకులు. తమ పార్టీ లోపాలు చర్చించుకోవాల్సిన వేదికలపై కూడా అధికార పక్ష నేతలను తూలనాడుకునే స్థాయికి ఈ అసహనం పెరిగిపోయిందటూ ఉదాహరణలతో కూడిన వివరణలు ఇస్తున్నారు. రాష్ట్రానికి వచ్చినప్పటికీ నాయకుల్ని నేరుగా కలవడం మానేసిన చంద్రబాబు జూమ్లతోనే కాలక్షేపం చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివి ధ పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో జరుగుతున్న సమావేశాల్లో […]