ఎంతోకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వేజోన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో నిన్న బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ […]