ఇంకా షూటింగులు మొదలుకాలేదు కానీ లాక్ డౌన్ కు ముందు ఫస్ట్ కాపీలు సిద్ధం చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు తెచ్చేసుకుంటున్నాయి. రెండు వారాల ముందే అనుష్క ‘నిశబ్దం’ యు/ఎ తెచ్చుకోగా తాజాగా సత్యదేవ్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కూడా ఇదే క్యాటగిరిలో ధృవీకరణ అందుకుంది. మరోవైపు సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ తమిళ్ లో ఈ తతంగం పూర్తి చేసుకుంది. తెలుగు వెర్షన్ కూడా రేపో ఎల్లుండో జరిగిపోతుంది. అయితే […]