ఏలూరులో గుర్తు తెలియని అస్వస్థత అంశంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని పలు సంస్థలు చేస్తున్న పరిశోధన పురుగుమందుల అవశేషాల వద్దనే ఆగింది. త్రాగునీటి శాంపిల్స్ విషయంలో అంతా సంతృప్తిని వ్యక్తం చేసారు. అయితే అస్వస్థతకు గురైన వారి రక్తం, యూరిన్లలో భార లోహాల అవశేషాలు ఎలా చేరాయన్నదానిపై మాత్రం లోతైన పరిశోధన చేస్తున్నట్లు ఆయా సంస్థలు సీయం వైఎస్ జగన్తో జరిగిన వీడియో సమీక్షా సమావేశంలో స్పష్టం చేశాయి. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? […]