తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలోని తిరుపతి లోక్సభకు, తెలంగాణలోని నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 17న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణలో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17న […]