జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. కమిటీ అధ్యక్షుడు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు రెండోసారి హైపవర్ కమిటీ విజయవాడలో సమావేశమైంది. రెండు కమిటీల నివేదికలల్లోని అంశాలను పరిశీలించిన కమిటీ, వాటిపై మరింత క్షణ్నంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకే మరో మారు ఈ నెల 13వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణను సిఫార్సు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై చర్చించేందుకు హైపవర్ కమిటీ ఈ రోజు రెండో సారి సమావేశం కాబోతోంది. జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లోన అంశాలపై సమగ్రంగా చర్చించి రాజధాని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిపై ఏ విధంగా ముందుకెళ్లాలో రాష్ట్రప్రభుత్వానికి హై పవర్ కమిటీ దిశానిర్ధేశం చే సేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, సీనియర్ […]
రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అంశాల పై ప్రభుత్వం నియమించిన జియన్ రావ్ కమిటీ మరియు బోస్టన్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన తుది నివేదికలను క్షుణ్ణంగా, కూలంకుషంగా అధ్యయనం చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27 న మంత్రి వర్గ తీర్మానం ద్వారా నియమించిన హైపవర్ కమిటీ ఈ రోజు తొలిసారిగా భేటీ అవ్వనుంది. విజయవాడలోని ఏపి సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. హైపవర్ కమిటీలో ఉన్న మొత్తం 10 మంది మంత్రులతో పాటు ఆరుగురు ఉన్నతాధికారులు […]
ఏపీ రాజధానిపై 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యవహరిస్తారు. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిమూలపు సురేశ్, పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ […]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడింగ్ ట్రేడింగ్‌పై దర్యాప్తు చేయించాలని సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ రోజు శుక్రవారం తీర్మానించిన విషయం తెలిసిందే. న్యాయ నిపుణల సలహా మేరకు ఏ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలన్నది నిర్ణయించనున్నారు. జాతీయ స్థాయిలోని సీబీఐ, లేదా రాష్ట్రపరిధిలోని సీబీ సీఐడీ.. ఇలా ఏ సంస్థ అనేది న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు […]