బ్యాంకులకు వేల కోట్ల రూపాయిలు ఎగ్గొట్టి విదేశాల్లో జల్సాలు చేస్తున్న లిక్కర్ వ్యాపారి, మాజీ ఎంపి విజయ్ మాల్యా త్వరలోనే ఇండియాకు రానున్నారు. తనను భారత్కు పంపించొద్దంటూ విజయ్ మాల్యా పెట్టుకున్న పిటిషన్ను బ్రిటన్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన ఇక ఇండియా రావడం ఖాయమైంది. యునైటెడ్ స్పిరిట్స్ మాజీ యజమాని, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా ఆర్థిక మోసం, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై సిబిఐ, ఈడిలు దర్యాప్తు […]