వెంకీమామ ఊళ్లోకి ఎంటర్ అయ్యాను. పెద్ద జుట్టు, రకరకాల రుద్రాక్షమాలలు మెడలో ధరించి నాజర్ ఎదురయ్యాడు. “జాతకాలు, జ్యోతిష్యాలంటూ వెంకీమామకి , నాగచైతన్యకి అనవసర కష్టాలు తెచ్చింది మీరే కదా” అన్నాను. “నేను భవిష్యత్ తెలిసిన వాన్ని” అన్నాడు నాజర్ గంభీర స్వరంతో. “తెలిసినప్పుడు, అరేయ్ బాబూ , నీ వల్ల మీ మామ ప్రాణాలకి ప్రమాదం అని ఒక మాట చెబితే- చైతన్య హాయిగా రాశీఖన్నాతో లండన్ వెళ్లిపోయేవాడు కదా. ఇంటర్వెల్ వరకు ఆగడం ఎందుకు” […]