ఫిబ్రవరిలో విడుదలైన పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది. అది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రం కావడంతోనే బీజేపీ ఓడిందని అనుకున్నారు. మూడు రోజుల క్రితం కర్ణాటకలో కూడా బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. […]