ఒకపక్క ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరి ముఖ్యంగా అస్సాం అంతా అట్టుడుకుతున్న తరుణంలో స్వయానా అస్సాం రాష్ట్రానికి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా చేసిన సైదా అన్వరా తైమూర్ పేరు ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) లో లేకపోవడం ఇప్పుడు అస్సాంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మాజీ కాంగ్రెస్ నాయకురాలైన సైదా అన్వరా తైమూర్ అస్సాంలోనే కాక యావత్ భారత దేశంలోనే తొలి ముస్లిం ముఖ్యమంత్రి కావడం గమనార్హం […]