కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిలు వెలుగులోకి వచ్చారు. జనవరి 5వ తేదీ నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న భార్గవ్‌రామ్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఈ రోజు బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు పోలీసులకు సరెండర్ అవడంతో ఈ కేసులో నిందితుల అరెస్ట్ పూర్తయినట్లైంది. ఓ భూ వివాదంలో ఈ […]
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలోని బోయినపల్లిలో జరిగిన కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సికింద్రాబాద్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రేపు శనివారం అఖిల ప్రియ జైలు నుంచి విడుదల కానున్నారు. భూ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్‌లో అఖిల ప్రియతోపాటు […]
టిడిపి మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో భార్గవ్ కు పోలీసులు నోటీసులిచ్చారు. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టిడిపి నేత, ఏపి సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో ఇటీవల నలుగురు నిందితులను కడప పట్టణంలోని చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే విచారణకు హాజరుకావాలని అఖిల ప్రియ భర్త భార్గవ్ కు నోటీసులిచ్చారు. […]