1983 సంవత్సరం. ‘మంచుపల్లకి’తో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వంశీకి ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది కానీ కమర్షియల్ గా మరీ గొప్ప స్థాయికి వెళ్లలేకపోయింది. సున్నితమైన కథాంశాన్ని నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయితో చేసిన స్నేహం గురించి తీసిన తీరు విమర్శకులను మెప్పించింది. అప్పుడే తను అసిస్టెంట్ గా ఎన్నో చిత్రాలకు పని చేసిన పూర్ణోదయా సంస్థ నుంచి వంశీకి ఆఫర్ వచ్చింది. మంచి కథను సిద్ధం చేసుకోమని చెప్పారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. అప్పటికే […]